Become a Defender of Justice and Liberty, Join CJP

‘సిటిజన్స్ ఫర్ జస్టిస్’ (సిజెపి) న్యాయం కోసం పౌరులు అనేది ఒక మానవ హక్కుల ఉద్యమం, ఇది అందరు భారతీయుల స్వేచ్ఛ మరియు వారి రాజ్యాంగ హక్కులను సమర్థించడానికి , ఆ హక్కులను రక్షించడానికి అంకితం చేయబడిన సంస్థ. మా సిజెపి యొక్క దృష్టి మరియు ఆశయాలను మా నాలుగు స్తంభాలుగా పిలుస్తాము.

అవి ఏమిటి అనగా:

బలహీనవర్గాల హక్కులు మత, జాతి, కుల, లింగ మరియు లైంగిక వర్గాల హక్కులు, శారీరక మరియు మానసిక వికలాంగుల హక్కులను పరిరక్షించడం.

వ్యక్తీకరణ స్వేచ్ఛ ‘ఫ్రీడం ఆఫ్ ఎక్స్ప్రెషన్’- ఒక ఆరోగ్యకరమైన మరియు బలమైన ప్రజాస్వామ్యం అనేది ఎల్లప్పుడూ స్వేచ్ఛా పూరితమైన మరియు ఉచిత వ్యక్తీకరణను అమలు చేయడమే కాకుండా వివిధ నమ్మకమైన వ్యవస్థల సంస్కృతులు, వారి సంప్రదాయాలు మరియు భాషల యొక్క గౌరవాన్ని కూడా గౌరవిస్తుంది. ద్వేషపూరిత ప్రసంగం అనేది ఈ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తుందని, ప్రజాస్వామ్యం మనకు ఇచ్చే ఆ గౌరవానికి భంగం కలిగిస్తుంది అనేది మా నమ్మకం.

నేర చట్ట సంస్కరణ ‘క్రిమినల్ జస్టిస్ రీఫారం’ లోని మా దర్యాప్తు విభాగం మరియు న్యాయ వ్యవస్థ విభాగాలు రెండింటి లో కూడా, కేవలం నాణ్యత మాత్రమే కాక సత్వర న్యాయం కూడా అందించడం కోసం మరింత ప్రజాస్వామీకరణ అనేది అవసరమని మా నమ్మకం.

బాల్య హక్కులు ‘చైల్డ్ రైట్స్’ - సిజెపి యువతలో బహు వచన విలువలతో పాటు రాజ్యాంగ విలువలను కూడా బోధించటానికి పని చేస్తుంది. ఈ క్రమంలో మేము ‘జువెనైల్ జస్టిస్ రిఫార్మ్’ బాల్య న్యాయం సంస్కరణ రంగంలోనే కాక లైంగిక వేధింపుల నుండి పిల్లలను కాపాడే దిశగా కూడా పోరాడుతున్నాము.


అమలులో సిజెపి:

2017-2018 లో చట్టపరమైన ప్రచారాలతో పాటు పోలీసుల యొక్క విధి నిర్వహణకు సంబంధించిన పార దర్శకత్వంలో పౌరుల యొక్క మధ్య వర్తిత్వ మధ్య వ్యక్తిత్వాలు మరియు వారి జవాబుదారీతనం మా కార్య నిర్వహణకు భంగం కలిగించాయి.

ఈ క్రమంలో వీటిని అధిగమించడానికి మేము కొనసాగించిన కార్యక్రమాలలో కొన్ని:

 • దళిత నేత చంద్రశేఖర్ ఆజాద్ 'రావన్' కు వ్యతిరేకంగా జాతీయ భద్రతా చట్టం ‘నేషనల్ సెక్యూరిటీ యాక్ట్’ (ఎన్ఎస్ఎ) ద్వారా చేయబడిన అన్ని ఆరోపణలను తొలగించి, వారిని విడుదల చేయించడం. ఢిల్లీలోని భీమ్ ఆర్మీకి అలహాబాద్‌లోని వారి న్యాయవాదులతో సమావేశాలు ఏర్పాటు చేసి కావలసిన సంప్రదింపులు జరిపించడము. ఈ క్రమంలో విడుదల చేసిన మా యొక్క వీడియో అప్పీల్ ప్రజలు తమ ఇష్టాయిష్టాలను ప్రభుత్వానికి తెలిపేందుకు సాధనగా మారింది. ఈ అప్పీల్ యొక్క ఘనవిజయం కారణంగా మా change.org పిటిషన్‌కు వేలాది సంతకాలు సమకూరాయి.
 • • సినభద్రలోని ఆదివాసీ కార్మికుల మానవ హక్కుల రక్షణ సంఘం ‘ఆదివాసీ హ్యూమన్ రైట్స్ డిఫెండర్స్ (హెచ్ఆర్డిస్)’కు వ్యతిరేకంగా కల్పించిన కేసులను అమలు చేయడానికి వ్యతిరేకంగా అఖిల భారత ఆదివాసీ కార్మికుల సంఘం ‘ఆల్ ఇండియా యూనియన్ ఆఫ్ ఫారెస్ట్ వర్కింగ్ పీపుల్స్ (AIUFWP’) తో పాటు సిజెపి పోరాడుతోంది. మేము తమ భూములు, నీరు మరియు ఆస్తులు మరియు అడవులను వారిపై జరిగే దోపిడీల నుంచి కాపాడటానికి వారు విరామం లేకుండా చేస్తున్న అసమాన పోరాటం కారణంగా వారిపై మోప బడిన ఈ కల్పిత కేసులను రద్దు చేయించడానికై న్యాయవాదుల బృందంతో కలిసి పనిచేస్తున్నాము. ఈ కేసును అలహాబాద్ హైకోర్టుకు తీసుకు వెళ్ళే లక్ష్యంతో ఉత్తర ప్రదేశ్‌లోని సాన్భద్రలో సీనియర్ న్యాయవాదుల యొక్క నేతృత్వంలో జరుగుతున్న పోరాటంలో సిజెపి వారితో పాటూ కలిసి పని చేయడం జరిగింది. ఈ కేసులు త్వరలో కోర్టులో దాఖలు చేయబడతాయి.
 • ఢిల్లీలోని దళితులను లక్ష్యంగా చేసుకుని భీమా కోరేగావ్ వద్ద దళిత కమ్యూనిటీపై జరిగిన దాడులు, వాటికి సంబంధించిన బందుల తర్వాత బాధితులు మరియు వారి కుటుంబాల సిజెపి నిర్వహించిన కార్యక్రమాలలో కొన్ని:
  • మహారాష్ట్ర అంతటా దళిత కుటుంబాల తో మాట్లాడి వారిపై జరిగిన దాడులు గురించి అవసరమైన సాక్ష్యాధారాలను సేకరించడం.
  • సీనియర్ న్యాయవాది మిహిర్ దేశాయ్ తో సంప్రదింపులు జరపడం మరియు దీని కోసం వివిధ కార్యకర్తలను, దళిత నేతలను మరియు దళిత సంఘాలను కలపడం మరియు వీరి మధ్య సంభాషణలను ఏర్పాటు చేయడం.
  • భీమ కోరగావ్ కేసులో అబద్ధపు ఆరోపణలను కొట్టి వేసేందుకు జిందాష్ మీవానీ మరియు ఉమర్ ఖాలిద్ అనబడే యువక నాయకులను బొంబాయి హైకోర్టుకు తరలించే యొక్క కార్యక్రమంలో కూడా సిజెపి దోహద పడింది. వీరిద్దరిపై హింసా కాండకు సహకరిస్తున్నారనే అబద్ధపు ఆరోపణలు మోపబడ్డాయి.
 • సిజెపి, శ్యామ్ బెనెగల్, అపర్ణ సేన్ మరియు ఆనంద్ పట్వర్ధన్లతో సహా 32 మంది ప్రముఖ భారతీయులు అయోధ్య వివాదానికి సంబంధించి జోక్యం చేసుకున్నారు. అయోధ్యలో భూమిపై వివాదాస్పదంగా వ్యవహరించ వద్దని వీరు పేర్కొన్నారు. రామ జన్మభూమి వివాద విషయంలో శాశ్వత స్థిరత్వాన్ని మరియు శాంతిని కలగజేయడానికి లౌకిక పరిష్కారాన్ని కనుగొనేందుకు ప్రయత్నం చేయాలని వీరు సుప్రీం కోర్టును కోరారు. ఈ క్రమంలో సిజెపి ప్రవేశ పెట్టిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చినప్పటికీ, మేము మా శాంతి కార్యక్రమాలను యధా ప్రకారంగా కొనసాగిస్తున్నాము. త్వరలో సుప్రీం కోర్టులో పిటిషన్ వేయడం లో కూడా సిజెపి పాల్గొనే అవకాశాలు ఉన్నాయి.
 • ఫిబ్రవరి 2018 లో అయోధ్యలో మొదలైన కపటమైన, మత పరమైన రథ యాత్రపై శాంతి యుతంగా నిరసన వ్యక్తం చేయాలని సిజెపి పిలుపునిచ్చింది. 41 రోజుల పాటు జరిగే ఈ యాత్ర వెనుక ఉద్దేశం రామ మందిరం నిర్మాణం కోసం మద్దతును సమీకరించేందుకు భారత దేశాన్ని మత పరమైన మార్గాలలో విభజించడం. అయోధ్య లో జరిగే ఈ యాత్రను వ్యతిరేకించడం కోసం సిజెపి పోరాడుతుంది. ఈ యాత్రను వ్యతిరేకించడం ద్వారా సామాజిక శాంతి సామరస్యాలను పెంపొందించడానికి సిజెపి ప్రయత్నిస్తుంది.
 • ఒడిశా హైకోర్టు మరియు సుప్రీం కోర్టులలో తమపై ఉన్న బూటకపు ఆరోపణలు తొలగించే పనిలో పోస్కో ప్రతిరోధ్ సంగ్రం సమితి అనే సంస్థకు సిజెపి మద్దతిస్తుంది. ఈ ఆరోపణలను తొలగించే క్రమంలో ఒడిషా ముఖ్య మంత్రి నవీన్ పట్నాయక్ కు సిజెపి లేఖ రాయడం జరిగింది. కేవలం ఇది మాత్రమే కాక ఈ బలహీన వర్గాలకు, వాటి సమాజాలకు సహాయం అందించేందుకు ఆన్లైన్ ప్రచారాన్ని కూడా సిజెపి ఆరంభించింది.
 • సిజెపి ద్వేష పూరిత ప్రసంగాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ప్రచారం ఆరంభించింది. మనస్సాక్షి తో పాటు తమ దేశం పట్ల బాధ్యతా భావం కలిగి ఉన్న పౌరుల సహకారంతో మేము వివిధ ప్రదేశాలలో జరిగిన ద్వేష పూరిత ప్రసంగాల యొక్క సాక్ష్యాలను సేకరించి, ఇంతకు ముందు ఉత్తర ప్రదేశ్‌లోని కస్గంజ్ మరియు అమ్రోహా లో చేసిన విధంగానే వెంటనే ఈ విషయాన్ని అధికారుల అవగాహనకు తీసుకువచ్చాము. మేము సేకరించిన సాక్షాధారాలు రుజువైన క్రమంలో అక్కడి జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు (NHRC) ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకుని అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా వారికి మేము విజ్ఞప్తి చేశాము. ఆ ప్రదేశాలలో ఉన్న కొద్ది కాలంలోనే మేము సేకరించిన సాక్ష్యాలకు, అక్కడి అధికారులు ప్రధాన మీడియా ద్వారా ప్రజలకు విడుదల చేసిన నివేదికలకు తరచూ చాలా వ్యత్యాసం ఉండటం గమనార్హం.

సిజెపి యొక్క ఇతర కార్యక్రమాలు

వర్క్‌షాప్‌లు మరియు శిక్షణా సమావేశాలు: మీడియా విద్యార్థులకు, కార్యకర్తలకు, చట్టబద్దమైన అభ్యాసకులకు మరియు ఉపాధ్యాయులకు కావలసిన సహకారాన్ని అందించడానికి సిజెపి వివిధ వర్క్‌షాప్‌లను నిర్వహిస్తుంది. కేవలం ఈ వర్క్‌షాప్ లే కాక రాజ్యాంగ విలువలు, బహువచన, చారిత్రిక మరియు సాంఘిక శాస్త్రాలలో కూడా ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలను సిజెపి నిర్వహిస్తుంది.

‘హౌ టు స్పాట్ అండ్ స్టాప్ ఫేక్ న్యూస్’ తప్పుడు వార్తలను గుర్తించడం ఎలా అనే విషయంపై సిజెపి యొక్క వర్క్‌షాపులు చెన్నై, మంగుళూరు, ముంబై , మరియు వారణాసిల తో పాటూ చాలా ప్రదేశాలలో నిర్వహించబడుతున్నాయి. ఇలాంటి ఒక వర్క్‌షాపు ఫిబ్రవరి 2018 లో వారణాసి మహాత్మా గాంధీ కాశీ విద్యా పీఠ్లోని ఒక రైట్ వింగ్ తీవ్రవాది హృదయంలో భయం పెంచింది. వారు బెదిరింపులతో సిజెపి కార్యదర్శి థీస్థా సీతల్వాడ్ ను చుట్టుముట్టి వర్క్‌షాప్ నిర్వహించడం నుండి మమల్ని నిరోధించడానికి ప్రయత్నించారు, ఈ వర్క్‌షాప్ వారి కార్య నిర్వహణ లోని తప్పులను బహిర్గతం చేయడం కోసం రూపొందించబడింది. కానీ బెదిరింపులకు భయపడకుండా వర్క్‌షాప్ మరొక వేదిక వద్ద యథాప్రకారంగా కొనసాగింది.

చట్టపరమైన మరియు సాంఘిక సాధనాలు:
రాజ్యాంగ విలువలకు, వాటి యొక్క రక్షకులకు సహాయం అందించాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని, సిజెపి లింగ, లైంగిక ,కుల, మత మరియు బాలల హక్కుల వంటి విస్తృత సమస్యల గురించి సమగ్ర సమస్యల గురించి చట్టపరమైన మరియు సామాజిక సాధనాలను సమకూర్చింది.

సిజెపి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించబడే మరిన్ని కార్యక్రమాలు మరియు వర్క్‌షాపులు గురించి సమాచారం కోసం ఈ లింకును వాడండి.

మన సమాజం పై సిజెపి చూపిన ప్రభావం గురించి ఇక్కడ తెలుసుకోండి

మరింత సమాచారం కోసం మరియు సమాధానాల కోసం మాకు మమ్మల్ని [email protected] ద్వారా సంప్రదించండి.

Go to Top